![]() |
![]() |

శ్రీరామా నవమి స్పెషల్ థీమ్ తో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో రాబోతోంది. ఇక ఇందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. బిందె మధ్యలో పెట్టి అటు ఇటు భార్య భర్తలని కూర్చోపెట్టి గేమ్ ఆడించింది. అలాగే చాల ప్రశ్నలు కూడా అడిగింది. ముందుగా ఆకర్ష్ బైరముడి వచ్చాడు. "మొగుడికి కొన్ని కోరికలుంటాయి. భార్యకు కూడా కోరికలు, ఆశలు ఉంటాయి ..ముందు మీకు అలాంటి తీరని కోరిక ఏంటి " అని అడిగింది శ్రీముఖి. ఆకర్ష్ వాళ్ళ వైఫ్ "మా ఆయన్ని ఒక సోలో పెర్ఫార్మెన్స్ లో చూడాలి" అని చెప్పింది. "నిజం చెప్తున్నా ప్యాంట్ చిరిగే పెర్ఫార్మెన్స్ లో చూస్తావ్ " అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. "ఇంతకు మంజుల గారు మీకున్న కోరికలేంటి " అని అడిగింది. "మీరలా లుక్ ఇవ్వొద్దు విలన్ లాగా.. ప్రిన్సీని ఎప్పుడూ ఇలా చూడలేదే మీరు" అంటూ నిరుపమ్ కి వార్నింగ్ ఇచ్చింది . "మీదేంటి కోరిక " అని అడిగింది. "నాతో పాటు జిమ్ కి రమ్మనండి . ఈ 15 ఏళ్ళల్లో అది ఇంతవరకు చేయలేకపోయాను " అంటూ చెప్పాడు నిరుపమ్. "ఆవిడ ఫిట్ గానే ఉందిగా " అంది శ్రీముఖి. దానికి మంజుల నవ్వేసింది. "ఓహో మీకు ప్రిన్సి లాంటి ఫిగర్ లే నచ్చుతాయిలెండి " అనేసింది. దానికి అందరూ నవ్వేశారు. "నీకేం కావాలి కరం నుంచి " అని అడిగింది శ్రీముఖి.
డాలీ వెంటనే "ఊరికే తిడతాడు పొద్దు లేచిన దగ్గర నుంచి " అంది. "లేదు లేదు తెలుసుకుంటాడులే ఇప్పుడు ఒక్క కంప్లైంట్ కదా నెక్స్ట్ ఆ కంప్లైంట్ కూడా ఉండదు " అంటూ సపోర్ట్ చేసి మాట్లాడాడు నిరుపమ్ . తర్వాత ఏక్నాథ్ - హారిక వచ్చారు. "హారిక మీ వాయిస్ ని తొక్కేస్తోంది " అనేసరికి డాక్టర్ బాబు నవ్వాడు. "ఎందుకు నవ్వుతున్నాడు మా డాక్టర్ బాబు " అని అడిగాడు అవినాష్. "ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి అంటూ సెటైర్ వేసింది శ్రీముఖి.
![]() |
![]() |